Chakali Ilamma Jayanti
* సిద్దిపేటలో మంత్రులు పొన్నం, వాకిటి నివాళులు
ఆకేరు న్యూస్, సిద్దిపేట : సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆమెకు ఘన నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కార్పొరేషన్ చైర్మన్లు సరితా తిరుపతయ్య యాదవ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, చరణ్ కౌశిక్ యాదవ్ తదితరులతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
*అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ జీవితం, పోరాటం తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. నాటి సామాజిక పరిస్థితుల్లో అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు.
భూస్వామ్య, సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేసిందన్నారు. చాకలి ఐలమ్మ కేవలం ఒక వ్యక్తి కాదని.. అన్యాయానికి ఎదురు నిలిచిన పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచారని మంత్రులు పేర్కొన్నారు.
మహిళలు, బడుగు బలహీన వర్గాలు తమ హక్కుల కోసం ముందుకు రావడానికి ఆమె జీవితం స్ఫూర్తిని ఇచ్చిందన్నారు.
* ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి..
సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధించేందుకు కృషి చేయడమే చాకలి ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు. ఆమె ఆశయాలను నేటి తరానికి తెలియజేయడంతో పాటు, ఆమె పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
తెలంగాణ చరిత్రలో కీలక పాత్ర పోషించిన మహనీయుల త్యాగాలు, పోరాటాలను గుర్తుచేసుకుంటూ వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
