Mohibullah Ansari IPS
* ఒకప్పుడు క్లాస్‌లో ఫెయిల్.. * నేడు అమెరికాలో 'ఏషియన్ హీరో 2026' * బిహార్ IPS ఆఫీసర్ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఆకేరు న్యూస్, డెస్క్: అయిన ఒక సాధారణ విద్యార్థి.. కష్టపడి దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీసెస్ సాధించి, నేడు అంతర్జాతీయ వేదికపై భారతీయ పోలీసు వ్యవస్థ ఖ్యాతిని చాటిచెప్పారు. ఆయనే బిహార్ రాష్ట్రం, ముజఫ్ఫర్‌పూర్ సిటీ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ మొహిబుల్లా అన్సారీ (Mohibullah Ansari IPS).
* అమెరికాలో అరుదైన పురస్కారం
అమెరికాలోని ఫ్లోరిడా (తంపా)లో 2026 డిసెంబర్ 13న జరగనున్న 7వ ‘వరల్డ్ ఫెయిర్ & ఫెస్టివల్’ కార్యక్రమంలో ‘అసోసియేషన్ ఆఫ్ వరల్డ్స్ ఫెయిర్స్ అండ్ ఫెస్ట్స్ USA’ సంస్థ మొహిబుల్లా అన్సారీని ‘ది ఏషియన్ హీరో అవార్డు 2026’ (The Asian Hero Award 2026) తో సత్కరించనుంది.
పోలీసు శాఖలో ఆయన చూపిన అత్యుత్తమ నాయకత్వ పటిమ, నిబద్ధత, నిజాయితీ మరియు ప్రజాసేవకు గుర్తింపుగా ఈ అంతర్జాతీయ అవార్డును అందజేస్తున్నారు.
* జీవితాన్ని మార్చేసిన తండ్రి మాట..
బిహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన మొహిబుల్లా అన్సారీ పాఠశాల రోజుల్లో చదువులో వెనుకబడి ఉండేవారు. 10వ తరగతి, 12వ తరగతి ప్రీ-బోర్డ్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో ఆయన తండ్రి తీవ్ర అసంతృప్తి చెందారు. “ఐఐటీకి వెళ్లాలనుకుంటున్నావ్.. కనీసం పాస్ మార్కులు కూడా తేలేకపోతున్నావ్” అని తండ్రి అన్న మాటలు ఆయన మనసులో బలంగా నాటుకుపోయాయి.
* ఐఐటీ నుంచి ఐపీఎస్ వరకు..
తండ్రి మాటలను సవాలుగా తీసుకున్న మొహిబుల్లా, రాత్రింబవళ్లు కష్టపడి JEE పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 2011లో ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీ (IIT Delhi)లో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్ని రోజులు కార్పొరేట్ ఉద్యోగం చేశారు.
అయితే, ప్రజాసేవ చేయాలనే ఆశయంతో ఉద్యోగాన్ని వదిలి 2015 నుంచి యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యారు. మూడో ప్రయత్నంలో 2020 సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 389వ ర్యాంకు సాధించి బిహార్ క్యాడర్ IPS అధికారిగా ఎంపికయ్యారు.
పాఠశాల స్థాయిలో పరాజయం పాలైనా, పట్టుదలతో కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని మొహిబుల్లా అన్సారీ ప్రయాణం నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
