Farmer Registry
Farmer Registry| ఆకేరు న్యూస్, కమలాపూర్: ప్రభుత్వ పథకాలు పొందడంతో పాటు ఎరువులు, ధాన్యం విక్రయాలు చేసేందుకు రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర సూచించారు.
శనివారం కమలాపూర్ మండలం మాదన్నపేటలో నిర్వహించిన ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాస్‌పుస్తకాలు కలిగిన రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఫార్మర్ రిజిస్ట్రీ రైతులకు ఎంతో కీలకమని, నమోదు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను లేదా సమీపంలోని మీ సేవ, కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వేణు, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
