జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
* రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యం
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ (Warangal Enumamula Market) యథాతథంగా కొనసాగుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వబోమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా మార్కెట్కు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు (Warangal Enumamula Market) సంబంధించిన సమస్యలపై జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ పాలకవర్గం, రైతు సంఘాల ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మార్కెట్కు పంట ఉత్పత్తులను తీసుకొచ్చే రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, మార్కెట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ మార్కెట్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి, సంబంధిత అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

