RTI Awarenes
RTI Awareness| ఆకేరు న్యూస్, వరంగల్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి. శ్రీనివాస్ రావు అన్నారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడే శక్తివంతమైన చట్టంగా ఆర్టీఐ నిలుస్తుందని పేర్కొన్నారు.
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో గుడిమళ్ల రవికుమార్ సభాధ్యక్షతన సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పి.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక పలువురు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని పొందేందుకు ఆర్టీఐ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
అధికారుల వద్దకు సమస్యలు తీసుకెళ్లినప్పుడు వాటిని వినేందుకు కూడా కొన్నిసార్లు ఓపిక లేకపోవడం బాధాకరమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా వ్యవస్థ పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సభాధ్యక్షులు గుడిమళ్ల రవికుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకుని వాటిని చట్టబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో నేరెళ్ల శోభ, శ్రీనివాస్ కుమార్, ప్రొఫెసర్ జ్యోతి రాణి, కొలూరు వెంకన్న, పెద్ద ఆంజనేయులు, నిమ్మల శ్రీనివాస్, కూతురు సత్యనారాయణ, ఎం. రమేష్, మండల పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
