Hyderabad Cancer Cases
* పింక్ పవర్ రన్లో మంత్రి సీతక్క..
* నెక్లెస్ రోడ్లో భారీగా పాల్గొన్న ప్రజలు
Hyderabad Cancer Cases| ఆకేరు న్యూస్, హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు ఫిట్‌నెస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహించిన ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన లభించింది. ఆదివారం నెక్లెస్‌రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ప్రాంతాలు వేలాది మంది యువత, సెలబ్రిటీలతో సందడిగా మారాయి. మేఘా ఇంజినీరింగ్ (ఎంఈఐఎల్), సుధారెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ రన్లో దాదాపు 30 వేల మందికి పైగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క, డీజీపీ సీవీ ఆనంద్, యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, మిస్ వరల్డ్ 2025 ఓపెల్ సుచాతా, నటుడు సిద్ధు జొన్నలగడ్డ, బాక్సర్ విజేందర్ సింగ్, సుధారెడ్డి ఫౌండేషన్ ఛైర్పర్సన్ సుధారెడ్డి, ఎంఈఐఎల్ ఎండీ కృష్ణారెడ్డి తదితరులు ప్రారంభించారు. ఫిట్నెస్ ట్రైనర్ కెవిన్ బృందం వార్మప్ వ్యాయామాలు నిర్వహించగా.. సంగీత దర్శకుడు థమన్ తన పాటలతో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు.
తొలి దశలో గుర్తించాలి
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్సకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మాట్లాడుతూ.. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన స్నేహితురాలికి సంఘీభావంగా 10కే రన్లో పాల్గొన్నట్లు తెలిపారు. సుధారెడ్డి, కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నివారణ ఆరోగ్యం, మెరుగైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు.
విజేతలు వీరే
మారథాన్‌లో వివిధ కేటగిరీల్లో పాల్గొన్న క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. 21 కిలోమీటర్ల పురుషుల విభాగంలో సునీల్ కుమార్, మహిళల విభాగంలో సోనమ్ ప్రథమ స్థానాల్లో నిలిచారు. 10కే విభాగంలో హరీష్ శరణ్, వందన పటేల్, 5కే విభాగంలో లవ్చౌదరి, అంజలి విజేతలుగా నిలిచారు. ఈ రన్లో పాల్గొనడం ఆనందంగా ఉందని విజేతలు తెలిపారు. మంచి ఉద్దేశంతో నిర్వహించిన పింక్ పవర్ రన్ నగరవాసుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు దోహదపడిందన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
