Shamshabad Cab Driver
* ప్రయాణికురాలిపై లైంగిక దాడి యత్నం
* రూ.60 వేలతో పరారీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్‌లో మహిళల భద్రతపై మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలోని తొండుపల్లి వద్ద ఒక క్యాబ్ డ్రైవర్ అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ప్రయాణికురాలిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి యత్నించడమే కాకుండా, ఆమె వద్ద ఉన్న రూ.60 వేల నగదుతో కూడిన బ్యాగ్‌ను లాక్కుని అక్కడి నుండి పరారయ్యాడు.
* అసలేం జరిగింది
లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం… బాధితురాలు తన ప్రయాణం కోసం ఒక ప్రైవేట్ క్యాబ్‌ను ఆశ్రయించింది. కారు శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా సమీపానికి చేరుకోగానే, డ్రైవర్ మృగంలా ప్రవర్తించడం ప్రారంభించాడు. ప్రధాన రహదారి గుండా వెళ్లాల్సి ఉండగా, ఒక్కసారిగా వాహనాన్ని పక్కకు మళ్లించి, సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అక్కడ కారు నిలిపివేసి, ప్రయాణికురాలిపై బలవంతంగా లైంగిక దాడికి ప్రయత్నించాడు. డ్రైవర్ దురాగతాన్ని గ్రహించిన సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. చాకచక్యంగా కారు తలుపులు తెరుచుకుని బయటకు పరుగులు తీస్తూ గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలకు భయపడిన క్యాబ్ డ్రైవర్, బాధితురాలికి చెందిన రూ.60,000 రోక్కం ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ను లాక్కుని వాహనంతో సహా చీకట్లోకి పరారయ్యాడు.
ఘటన అనంతరం తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు స్థానికుల సాయంతో సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. జరిగిన ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.
సీసీటీవీ పరిశీలన: తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ (CCTV) పుటేజీలను, కారు ప్రయాణించిన మార్గాల్లోని కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
వాహన గురింపు: క్యాబ్ నంబర్ ప్లేట్, బుకింగ్ వివరాలు (యాప్ ఆధారిత క్యాబ్ అయితే) సేకరించి డ్రైవర్ లొకేషన్‌ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. ప్రత్యేక బృందాలు: నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలను (Special Teams) రంగంలోకి దింపినట్లు శంషాబాద్ పోలీసులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
