TG SAFE Director Guguloth Randhan
* జాయింట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్గా పదోన్నతి..
* మహబూబాబాద్ జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం
ఆకేరు న్యూస్, వరంగల్ : మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండాకు చెందిన గిరిజన బిడ్డ, ఖీమా నాయక్ కుమారుడు గుగులోత్ రాంధన్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్’ (TG SAFE) తొలి డైరెక్టర్గా ఆయన నియమితులయ్యారు.
ఇప్పటివరకు అదే విభాగంలో జాయింట్ డైరెక్టర్గా సమర్థవంతంగా సేవలందించిన రాంధన్కు డైరెక్టర్గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం పునరుద్ధరించబడిన ఈ కీలక పదవిలో నియమితులైన తొలి అధికారిగా రాంధన్ రికార్డు సృష్టించారు.
సొంత ఊరిలో అభినందనల వెల్లువ
ఉన్నత పదవిలో నియమితులైన గుగులోత్ రాంధన్కు ఆయన స్వగ్రామమైన తూర్పు తండా ప్రజలతో పాటు మహబూబాబాద్ జిల్లా వాసులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒక సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చి, ప్రభుత్వంలో ఇంతటి కీలక పదవిని అధిరోహించడం అందరికీ స్ఫూర్తిదాయకమని గ్రామస్థులు కొనియాడారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

