Palle Panduga
* ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్
ఆకేరు న్యూస్, నెల్లూరు : నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ పర్యటించనున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురంలో నిర్వహించనున్న పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో ఇరువురు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రామాపురం వేదికగా వీబీ–జీ రామ్ జీ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కార్యక్రమాలను చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

