CM Revanth Reddy
*సీడబ్ల్యూసీ భేటీకి హాజరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నేడు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.
సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, ఎమ్మెల్సీ స్థానాలపై కూడా చర్చ జరిగే అవకాశముంది.
అలాగే ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో చర్చించే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
