CM Revanth Reddy
*రూ.345.78 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఆకేరు న్యూస్, సిరిసిల్ల : ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా సిరిసిల్లకు రేవంత్‌రెడ్డి రానుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి.
పర్యటనలో భాగంగా మొత్తం రూ.345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి రఘుడు జంక్షన్ వరకు భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. రోడ్‌షోకు పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
రోడ్‌షో అనంతరం సుమారు లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అధికారులు, పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీఎం పర్యటనతో సిరిసిల్లలో రాజకీయ సందడి నెలకొంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
