Tirumala Devotees Rush
*సర్వదర్శనానికి 24 గంటలు
ఆకేరు న్యూస్, తిరుపతి :తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో టోకెన్ లేని భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.
మరోవైపు, నిన్న శ్రీవారిని 77,082 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 34,039 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.22 కోట్ల ఆదాయం లభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.
భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ అధికారులు క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
