Kishan Reddy
* కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో భేటీకి భట్టి విక్రమార్క..
* బొగ్గు సరఫరాపై కీలక చర్చ
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు సంబంధించి నేడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. థర్మల్ ప్లాంట్‌కు అవసరమైన G-9 గ్రేడ్ బొగ్గు సరఫరా అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
ప్లాంట్ నిర్వహణకు అవసరమైన బొగ్గు లభ్యత, సరఫరా పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలపై సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో యాదాద్రి పవర్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా అంశంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
