MLA Kadiyam Srihari
*ఎమ్మెల్యేకు కబడ్డీ అసోసియేషన్ వినతి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ఇండోర్ స్టేడియంను ఉపయోగంలోకి తేవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కబడ్డీ (MLA Kadiyam Srihari) అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందించారు.
స్టేషన్ ఘన్ పూర్ పట్టణంలోని నమిలిగొండ శివారులో ఉన్న ఇండోర్ స్టేడియం గత కొన్ని ఏళ్లుగా వాడుకలో లేనందున స్టేడియం తలుపులు, కిటికీలు ఇతర వస్తువులు ఇదిలావస్థకు చేరుతున్నాయన్నారు.
నియోజకవర్గలోని క్రీడాకారులందరికి ప్రాక్టీస్ చేసుకోవడానికి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కోచింగ్ క్యాంప్ ల ద్వారా క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, సహాయ కార్యదర్శి అన్నెపు కుమార్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
