Warangal Accident
Warangal Accident| ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై మామునూరు గ్రామ శివారులో కారు ప్రమాదానికి గురైంది. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక డివైడర్‌ను ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే వాహనంలోని ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో డ్రైవర్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
డివైడర్‌పై స్థానికుల ఆందోళన
మామునూరు పరిసరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక డివైడర్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా డివైడర్‌ను తొలగించాలని వారు కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
