ఆకేరు న్యూస్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె (Former Chief Minister KCR’s daughter), ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దాదాపు 105 రోజులుగా జైలులోనే ఉన్నారు. బెయిలు కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా కవితకు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసు (Delhi Liquor Policy Scam Case) లో మరోసారి నిరాశ ఎదురైంది. మనీ లాండరింగ్ (Money laundering) ఆరోపణలపై ఈడీ అరెస్ట్ (ED’s arrest) చేసిన కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ (Judicial remand) ను ట్రయల్ కోర్టు (Trial Court) మరోసారి పొడిగించింది. ఆగస్ట్ 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 16న ఈడీ అరెస్ట్ చేసింది. నేటితో జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుండగా… అధికారులు వర్చువల్గా ఆమెను న్యాయస్థానంలో హాజరు పర్చారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నదని.. ఈ సమయంలో కవిత కస్టడీ (Kavitha Custody) ని పొడగించాలని ఈడీ (ED) తరుఫు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవితకు మరో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో కేసీఆర్ కుటుంబం (KCR family), బీఆర్ ఎస్(BRS) శ్రేణులు ఆందోళనలో పడ్డారు.
———————-