Hanamkonda Journalists Protest
* హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల వినూత్న ఉద్యమం
*సీఎం రేవంత్‌కు 150 ఉత్తరాలు
* భారీ సంఖ్యలో పాల్గొన్న జర్నలిస్టులు
ఆకేరు న్యూస్, హన్మకొండ : జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) చేపట్టిన ఉత్తరాల ఉద్యమానికి హన్మకొండ జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు.
జర్నలిస్టులకు క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించాలనే ప్రధాన డిమాండ్‌తో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ హైదరాబాద్‌లో రాష్ట్రవ్యాప్తంగా పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా హన్మకొండ జిల్లాలోనూ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్‌కార్డుల ద్వారా తమ డిమాండ్లను తెలియజేశారు.
హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని మండల కేంద్రాల్లోనూ కొనసాగిస్తామని యూనియన్ జిల్లా అధ్యక్షుడు మస్కపురి సుధాకర్, కార్యదర్శి అర్షం రాజ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జర్నలిస్టులు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని, అయితే స్వరాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు అన్నారు.
జర్నలిస్టుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. క్యాష్‌లెస్ హెల్త్ కార్డులతో పాటు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డుల మంజూరు వంటి సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.క్యాష్‌లెస్ హెల్త్ కార్డుల మంజూరుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 150 పోస్ట్‌కార్డులు రాశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు చిలుమల్ల సుధాకర్, బీఆర్ లెనిన్, తడక రాజ్ నారాయణ, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, యూనియన్ నేతలు కక్కెర్ల అనిల్ కుమార్, పోగాకుల అశోక్, తాళ్లపెల్లి వేణుగోపాల్, పోగాకుల ప్రభాకర్, అల్లం రాజేష్ వర్మ, మైదం సుధాకర్, దుంపల పవన్, గోకారం శ్యాంకుమార్, బుడిగే శ్రీనివాస్, తోట తిరుమల్, మండ సాల్మాన్, సంపేట సుధాకర్, గొట్టె వెంకన్న, బండారి సతీష్, చేతి శ్రీనివాస్, చింతల సత్యనారాయణ, బొమ్మగాని ఆదర్శ్, దేవేందర్, కర్నాకర్, సునీల్, రవి తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
