Degree College
* సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరితో పాటు స్థల కేటాయింపు, భవన నిర్మాణానికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి పోశాల కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా పోశాల కృష్ణ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా డిగ్రీ కళాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అహర్నిశల కృషి, విద్యాశాఖపై ఉన్న అనుభవంతో డిగ్రీ కళాశాల తీసుకురావడం అభినందనీయం అన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు పైచదువులకై దూరప్రాంతాలు వెళ్లలేక, ఆర్థిక భారాన్ని మోయలేక మధ్యలోనే చదువును ఆపేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.
డిగ్రీ కళాశాల మంజూరి, ఏడాదిలోపే భవన నిర్మాణం పూర్తిచేస్తే నియోజకవర్గంలోని పేద విద్యార్థులందరూ చదువుకునే అవకాశం ఉందన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే దృఢ సంకల్పంతో సాగుతున్న ఎమ్మెల్యే శ్రీహరికి నియోజకవర్గ విద్యార్థులు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు షేక్ జానీ బాబా, సీనియర్ నాయకుడు మేకల మల్లేష్, ముదుంపురం కిషోర్, తోట బిక్షపతి, ఉమ, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుర్రం ఫాతి కుమార్, తోట, బిక్షపతి, గుర్రం రమేష్, అనిల్, ఉమాశంకర్ విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
