Errabelli Dayakar Rao
* కుందూరు వెంకటరెడ్డి అంతిమయాత్రలో నివాళి
ఆకేరు న్యూస్, రాయపర్తి : హనుమకొండలోని ప్రముఖ మాక్స్ కేర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఆయన భౌతికకాయానికి స్వగ్రామమైన కాట్రపల్లిలో అశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఈ విచారకర సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిపాటి శ్రీనివాస్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొని ఆయన పాడె మోశారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… డాక్టర్ వెంకటరెడ్డి మరణం వైద్య రంగానికి, అలాగే స్థానిక ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. వైద్యాధికారిగా, వ్యాపారవేత్తగా కాకుండా నిరుపేదలకు సేవ చేయాలనే తపన ఉన్న మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు, మిత్రులు, కాట్రపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ కుందూరు వెంకటరెడ్డికి అశ్రునివాళులు అర్పించారు అనంతరం పలు కుటుంబాలను పరామర్శించారు కిష్టాపురం గ్రామానికి చెందిన కోనసోత్ వెంకన్న ఖమ్మం జిల్లా కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తు ఎస్సై వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతుడు ఎస్సై వెంకన్న చిత్రపటానికి మరియు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఊడుగుల యాదగిరి, వాంకుడు తండాకు చెందిన వాంకులోతు రాంధన్, జరుబుల జోగియా, వారి కుటుంబాలను పరామర్శించి మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
