MGNREGA
*రోజుకు రూపాయలు 800 వేతనం ఇవ్వాలి
*వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిట్యాల సోమన్న
ఆకేరు న్యూస్, పాలకుర్తి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధాతధంగా అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిట్యాల సోమన్న డిమాండ్ చేశారు.
శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ చౌరస్తాలో ప్లే కార్డ్స్ తో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సోమన్న పాల్గొని మాట్లాడుతూ ఒకవైపున నిత్యవసర ధరలు మండిపోతున్నాయని ఇలాంటి సమయంలో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడమే తక్షణ పరిష్కారమని. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కోసం 2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని వెంటనే ప్రకటించి ఉపాధి పనులు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టంలో 125 రోజులు పని దినాలు పెంచిన కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయింపులో భారీ కోత విధించిందని చెప్పారు.
కేంద్రం ఇచ్చే 90% నిధుల వాట నుండి 60 శాతానికి కుదించిందని రాష్ట్ర ప్రభుత్వాల మీద 40% అధిక భారాన్ని మోపడం చూస్తే పేదలకు పని కల్పించే బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవడంలో భాగమేనని, పారదర్శకత పేరుతో రెండుసార్లు ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ అయితేనే వేతనాలు ఇస్తామనడం ఆందోళన కలిగిస్తుందని, తక్షణం రెండుసార్లు ఫోటోల విధానాన్ని రద్దు చేయాలని వారన్నారు.
పనిముట్లు ఇచ్చే పద్ధతిని నిలిపివేయడం పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వార వారం వేతనాలు ఇవ్వకపోవడం సమ్మర్ అలవెన్స్ రద్దు చేయడం, దూర ప్రాంతాల పనికి లోకల్ ట్రావెలింగ్ అలవెన్స్ రద్దు చేయడం కూలీల పని డిమాండ్ అప్లికేషన్ తీసుకోకపోవడం వంటి చర్యలు పనిని రద్దు చేయడం దానిలోనే భాగమే అని విమర్శించారు,
గ్రామీణ కూలీలు వ్యవసాయ పనులు కరువై ఉపాధి లేక వస్తువులతో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు,కరువు వర్షాభావం పకృతి వైపరీత్యాలతో ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న గ్రామీణ ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. తక్షణం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధాతధంగా అమలు చేసి ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజువారి కూలీ 800 రూపాయలు ఇవ్వాలని కోరారు,
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు కాకర్ల పద్మ, మండల అధ్యక్షులు కాకర్ల బాబు, కే ఎల్లమ్మ, కోంరమ్మ, సోమనరసమ్మ, కే ప్రవీణ్, సోమలక్ష్మి, జి లక్ష్మి, పి వెంకటమ్మ, మైసమ్మ, సోమక్క, బాలమ్మ, చంద్రమ్మ, బుచ్చమ్మ, కే ఎల్లమ్మ, ఈ లచ్చమ్మ, కే లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
