Na Wife Missing
Na Wife Missing| ఆకేరు న్యూస్, సినిమా: తెలుగు ఓటీటీ వేదిక ఆహా మరో ఆసక్తికరమైన ఒరిజినల్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నా వైఫ్ మిస్సింగ్’ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
భార్య కనిపించడం లేదంటూ వరుణ్ సందేశ్ పోలీసులను ఆశ్రయించడం చుట్టూ కథ సాగనున్నట్లు ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ ద్వారా తెలుస్తోంది. “ప్రతి కేసుకు ఒక కథ ఉంటుంది.. ఈ కేస్‌లో నిజం ఏంటి?” అనే క్యాప్షన్‌తో ఆహా సిరీస్‌పై ఆసక్తిని పెంచుతోంది.
అయితే అసలు ఆమె ఎందుకు మిస్సయ్యారు? ఈ కేసులో దాగి ఉన్న నిజం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం సిరీస్‌లోనే తెలియనుంది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని ఆహా అధికారికంగా ప్రకటించనుంది.
ఇక వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ గతంలో ‘కొత్త బంగారులోకం’ చిత్రంలో జంటగా నటించారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ‘నా వైఫ్ మిస్సింగ్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
