Palakurthi
* ఏకగ్రీవంగా ప్రశాంత్, లక్ష్మీనారాయణ ఎంపిక
Palakurthi| ఆకేరు న్యూస్, పాలకుర్తి: పాలకుర్తి మండల వార్డ్ మెంబర్స్ ఫోరం నూతన బాధ్యుల నియామకం ఏకగ్రీవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు ఈ నియామక కార్యక్రమాన్ని నిర్వహించారు.
జనగామ జిల్లా ఫోరం ఇంచార్జీ గుండేటి రామ్ చందర్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పసులాది ప్రశాంత్‌ను మండల ఫోరం ఇంచార్జీగా, కోల లక్ష్మీనారాయణను కో-ఇంచార్జీగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
హక్కుల సాధనపై దృష్టి
ఈ సందర్భంగా గుండేటి రామ్ చందర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో వార్డ్ మెంబర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు నూతన బాధ్యులు చొరవ చూపాలని సూచించారు. వార్డ్ మెంబర్లను సమన్వయం చేసుకుంటూ ఫోరాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
సమస్యల పరిష్కారానికి కృషి
తమకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్, జిల్లా ఇంచార్జీ గుండేటి రామ్ చందర్‌కు పసులాది ప్రశాంత్, కోల లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని వార్డ్ మెంబర్లందరినీ కలుపుకొని ఫోరం బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్, లక్ష్మీనారాయణలకు పలువురు వార్డ్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, ఫోరం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వార్డ్ మెంబర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
