CPI ML Liberation
* ఎక్సైజ్ అధికారులకు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ వినతి
Belt Shops| ఆకేరు న్యూస్, పాలకుర్తి: పాలకుర్తి మండలంలోని గ్రామాల్లో కొనసాగుతున్న అక్రమ మద్యం (బెల్ట్ షాపుల) విక్రయాలను అరికట్టాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు ఎక్సైజ్ అధికారులను కోరారు. ఈ మేరకు ఆదివారం ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం అందజేశారు.
పార్టీ పాలకుర్తి మండల కార్యదర్శి కొనకటి కళింగరాజు ఆధ్వర్యంలో నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళింగరాజు మాట్లాడుతూ.. పాలకుర్తి మండల కేంద్రంతో పాటు గ్రామపంచాయతీల పరిధిలో పెద్ద సంఖ్యలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడంతో పాటు, డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడం, ప్రశ్నించిన వారిని బెదిరించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.
పేద కుటుంబాలపై ప్రభావం
అక్రమ మద్యం విక్రయాల వల్ల పేద, అణగారిన వర్గాల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కళింగరాజు పేర్కొన్నారు. మద్యానికి బానిసైన కొందరు కుటుంబాల్లో భార్యాబిడ్డలను వేధించడం, గొడవలు జరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనలు చివరకు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నాయని తెలిపారు.
25 షాపులపై దాడులు చేయాలి
పాలకుర్తి మండల కేంద్రంలో అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 25 బెల్ట్ షాపులపై వెంటనే దాడులు నిర్వహించి, అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని కళింగరాజు ఎక్సైజ్ అధికారులను డిమాండ్ చేశారు. గ్రామాల పరిధిలోనూ అక్రమ మద్యం విక్రయాలపై తనిఖీలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గాయాల బాబు, గ్యార రాజు, పెద్ది రాహుల్, తూర్పాటి సారయ్య, కొండ బద్రి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
