Huzurabad Accident
* తొమ్మిది మందికి గాయాలు..
Huzurabad Accident| ఆకేరు న్యూస్, హుజూరాబాద్: కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి (NH-563)పై హుజూరాబాద్ పట్టణ పరిధిలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపాపయ్యపల్లి శివారులో ఓమ్ని వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
టైరు పేలడంతో అదుపుతప్పి..
హనుమకొండలోని కొత్తూరు జెండా ప్రాంతానికి చెందిన కూలీలు పనుల నిమిత్తం ఓమ్ని వ్యాన్‌లో కరీంనగర్ వైపు వెళ్తున్నారు. పెద్దపాపయ్యపల్లి శివారుకు చేరుకున్న సమయంలో వాహనం వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఆస్పత్రికి తరలింపు
ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలైనట్లు సమాచారం. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
