Nekkonda Hostel Teacher Attack
* నెక్కొండ హాస్టల్లో తీవ్ర కలకలం
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 5వ తరగతి చదువుతున్న చిన్నారి విద్యార్థులపై ఒక ఉపాధ్యాయురాలు విచక్షణా రహితంగా దాడి చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి.
హాస్టల్లో ఉంటున్న 5వ తరగతి విద్యార్థులను ఉపాధ్యాయురాలు దండన పేరుతో దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. టీచర్ చేసిన ఈ దాడితో చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని సమాచారం. పాఠశాలకు, హాస్టల్కు వెళ్లడానికే విద్యార్థులు భయపడే పరిస్థితి నెలకొందని స్థానికులు పేర్కొంటున్నారు.
* విచారణకు డిమాండ్
విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే ఇలా విచక్షణా రహితంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అమానుష ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
బాధ్యురాలైన ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులందరి రక్షణ, భద్రత కోసం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని బాధితుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
