Wardhannapet Woman Protest
* మున్సిపల్ చైర్మన్ ఇంటి ఎదుట బైఠాయింపు
Wardhannapet | ఆకేరు న్యూస్, వర్ధన్నపేట: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడో యువతి చేపట్టిన న్యాయ పోరాటం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో తీవ్ర కలకలం రేపుతోంది. తనకు తగిన న్యాయం జరిగే వరకు వెనకడుగు వేసేది లేదంటూ ఆమె మున్సిపల్ చైర్మన్ ఇంటి ఎదుట బైఠాయించి దీక్ష కొనసాగిస్తోంది. మూడేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్, బాధితురాలు తుమ్మల శ్రీదేవి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆయన తనను శారీరకంగా లోబరుచుకున్నాడని, ఈ కాలంలో తన ప్రమేయం లేకుండా బలవంతంగా అబార్షన్లు కూడా చేయించాడని బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే, తండ్రి మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత శ్రీకాంత్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, పెళ్లి గురించి నిలదీస్తే తనను మోసం చేసి ముఖం చాటేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేను ఆశ్రయించినా తనకు న్యాయం జరగలేదని వాపోయింది.
చైర్మన్ ఇంటి వద్దే ‘వంటా వార్పు’న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ తేల్చిచెప్పిన బాధితురాలికి మద్దతుగా చైర్మన్ ఇంటి ముందే వంటా వార్పు నిర్వహిస్తూ వినూత్న రీతిలో నిరసనను కొనసాగిస్తోంది. ఈ ఘటనతో వర్ధన్నపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మద్దతుగా దళిత, ప్రజా సంఘాలుయువతి చేపట్టిన ఈ పోరాటానికి దళిత సంఘాలు, మహిళా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బాధితురాలికి అండగా నిలుస్తామని స్పష్టం చేశాయి. మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు రేపు జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వర్ధన్నపేటకు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
