Dr Perumandla Ramakrishna| ఆకేరు న్యూస్, వర్ధన్నపేట: బహుజనులు, దళిత వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రముఖ వైద్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణకు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తెలంగాణ మాదిగ ప్రజా సమితి (TMPS) రాష్ట్ర అధ్యక్షుడు మేడ స్వామి మాదిగ కోరారు. మంగళవారం వర్ధన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్‌లో అంకితభావంతో..
విద్యార్థి దశలోనే NSUI ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నారని మేడ స్వామి మాదిగ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఇబ్బందులు, కేసులు ఎదురైనా పార్టీ మారకుండా కాంగ్రెస్‌లోనే కొనసాగారని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి ఆయన కృషి చేశారని తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన్ పదవి కూడా..
దళిత, బహుజన వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం డాక్టర్ రామకృష్ణ చేస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్సీ పదవితో పాటు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా కల్పించాలని మేడ స్వామి మాదిగ కోరారు. ఆయన అభ్యర్థిత్వానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మద్దతుగా సిఫారసు లేఖలు ఇచ్చారని తెలిపారు.
డాక్టర్ రామకృష్ణకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పరిశీలించాలని మేడ స్వామి మాదిగ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో TMPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొచ్చు మొగిలి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలువేరు సుధాకర్, నాయకులు బొడ్డు రమణ, కొత్తూరు అంజి, చిరిపల్లి భరత్, ఎర్ర అనిల్, గడ్డం రిశ్విక్, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
