Rajadhani bus from Bhupalapally depot suddenly filled with smoke
* భయాందోళనతో ప్రయాణికుల పరుగులు
* ఎగ్జిట్ డోర్లు పగలగొట్టిన ప్రయాణికులు
* భూపాలపల్లి డిపో బస్సులో ఘటన..
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి (Bhupalapally) డిపోకు చెందిన రాజధాని బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సులో మహిళలు, చిన్నారులు ఉండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
TS 03 Z 0513 నంబర్ గల రాజధాని బస్సు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు భయంతో బస్సు నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పొగ నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు ప్రయాణికులు ఎగ్జిట్ డోర్లను పగలగొట్టినట్లు సమాచారం.
ఈ క్రమంలో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. అనంతరం బస్సులో పొగలు రావడానికి గల కారణాలను పరిశీలించారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
