Perumandla Ramakrishna
* పెరుమాండ్ల రామకృష్ణ
Perumandla Ramakrishna| ఆకేరు న్యూస్, హనుమకొండ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని సహించబోమని టీపీసీసీ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రిని ఓ ప్రముఖ సినీ నటితో ముడిపెడుతూ సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
హనుమకొండలో విలేకరులతో మాట్లాడిన రామకృష్ణ.. సీఎం రేవంత్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకే బీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయాల్సిన రాజకీయ పార్టీలు వ్యక్తిగత అంశాలను తెరపైకి తీసుకురావడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
సోషల్ మీడియాను ఉపయోగించుకుని ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగత సంబంధాలపై పోస్టులు చేయడం ద్వారా పరువు నష్టం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
డీజీపీకి విజ్ఞప్తి
సీఎంపై నిరాధార ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు దృష్టి సారించాలని డాక్టర్ రామకృష్ణ కోరారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియా వేదికగా వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
