* ముందుగా డబ్బులు చెల్లించొద్దు..
* ములుగు జిల్లా ఎస్పీ హెచ్చరిక
ఆకేరు న్యూస్, ములుగు: నకిలీ లోన్ ఆఫర్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ సూచించారు. తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన ‘ఫ్రాడ్‌కు ఫుల్ స్టాప్’ కార్యక్రమంలో భాగంగా సైబర్ మోసాల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను బుధవారం ఎస్పీ ఆవిష్కరించారు.
తక్కువ వడ్డీ అంటూ మోసం
తక్షణ రుణాలు, తక్కువ వడ్డీకే లోన్, నిమిషాల్లో రుణం మంజూరు అంటూ సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారని ఎస్పీ తెలిపారు. అనంతరం లోన్ ప్రాసెసింగ్ ఫీజు, అడ్వాన్స్ ఫీజు, జీఎస్టీ తదితర పేర్లతో ముందుగానే డబ్బులు చెల్లించాలని కోరుతున్నారని చెప్పారు. ఇలాంటి ఆఫర్లను నమ్మి తొందరపడి చెల్లింపులు చేయవద్దని సూచించారు.
వివరాలు ఇవ్వొద్దు
లోన్ ఆఫర్ వచ్చినప్పుడు ముందుగా దాని నిజానిజాలను పరిశీలించాలని, రుణదాత వివరాలను ధృవీకరించాలని ఎస్పీ సూచించారు. అధికారికంగా గుర్తింపు పొందిన సంస్థల ద్వారా మాత్రమే రుణ సేవలు పొందాలని తెలిపారు. అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లోన్ యాప్‌లకు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని హెచ్చరించారు.
1930కు ఫిర్యాదు
ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డీసీఆర్బీ కిషోర్ కుమార్, ములుగు సీఐ దారం సురేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ప్రతాప్, వెంకటాపూర్ ఎస్ఐ చల్లా రాజు, డీసీఆర్బీ ఎస్ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
