Gadam Madhavi Kumar| ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాకు చెందిన గాదం మాధవి-కుమార్కు బీజేపీ మహిళా మోర్చాలో కీలక బాధ్యత లభించింది. మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గాదం మాధవి గత 12 సంవత్సరాలుగా బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతున్నారు. గతంలో ములుగు మేజర్ గ్రామపంచాయతీలోని 9వ వార్డు నుంచి బీజేపీ వార్డు సభ్యురాలిగా విజయం సాధించారు. సామాజిక సేవతో పాటు ప్రజా సమస్యలపై స్పందిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పలు బాధ్యతలను నిర్వహించారు. ఇటీవల ములుగు మున్సిపాలిటీలోని 3వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో తన సేవలను కొనసాగించారు.
బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తా
తనపై నమ్మకంతో రాష్ట్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తానని గాదం మాధవి తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పనిచేస్తూ అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని పేర్కొన్నారు.
తన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా అధ్యక్షుడు సీరికొండ బలరాం, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం, పార్టీ కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

