Congress Leaders
Rahul Gandhi| ఆకేరు న్యూస్, ములుగు: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టిన నిరసనను అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్యగా ఆయన అభివర్ణించారు.
ములుగు మండల కేంద్రంలోని వై-జంక్షన్ వద్ద బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
అయితే ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

