Aggipetti Macha
* అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్‌లో తుదిశ్వాస
Aggipetti Macha| ఆకేరు న్యూస్, తిరుపతి: సోషల్ మీడియాలో తనదైన కామెడీ, మాటతీరు, హావభావాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.
కిరణ్ కుమార్‌ను ఈ నెల 5న కుటుంబ సభ్యులు స్విమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు వచ్చిన అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబ సభ్యులు వెల్లడించలేదు.
* సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు
‘అగ్గిపెట్టె మచ్చ’ పేరుతో కిరణ్ కుమార్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందారు. ఆయన ప్రత్యేకమైన మాటతీరు, కామెడీ టైమింగ్, హావభావాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఆయన డైలాగులు, ఎక్స్‌ప్రెషన్స్‌ను అనుకరిస్తూ పలువురు వీడియోలు చేసేవారు.
యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఆయనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. పలువురు కంటెంట్ క్రియేటర్లు ఆయనను ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. కొన్ని టీవీ కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించారు.
కిరణ్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల్లో విషాదం నెలకొంది. ఆయనతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పలువురు యూట్యూబర్లు, కళాకారులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

