Vardhannapet student Vannala Rishmitha
* రిష్మితకు అరుదైన అవకాశం!
* అభినందించిన జిల్లా విద్యాశాఖ
ఆకేరు న్యూస్, వరంగల్ : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఇన్స్పైర్ అవార్డ్స్–మానక్ (Inspire Awards MANAK) పథకం కింద న్యూఢిల్లీలో అక్టోబర్ 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. 12వ జాతీయ స్థాయి ప్రదర్శన, ప్రాజెక్టుల పోటీలకు వరంగల్ జిల్లాకు చెందిన వన్నాల రిష్మిత ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆమెను అభినందించింది.
వర్ధన్నపేటకు చెందిన వన్నాల నాగరాజు, సౌభాగ్య దంపతుల కుమార్తె రిష్మిత 2023–24 విద్యా సంవత్సరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ కార్యక్రమంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. అనంతరం రాష్ట్ర స్థాయిలోనూ విజయం సాధించి, తన ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించడమే ఇన్స్పైర్ అవార్డ్స్–మానక్ పథకం ( Inspire Awards MANAK) ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులను జాతీయ స్థాయిలో ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.
రిష్మిత జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక కావడం ఆమె తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు, వర్ధన్నపేట ప్రాంతానికి, వరంగల్ జిల్లాకు గర్వకారణమని జిల్లా విద్యాశాఖ పేర్కొంది.
జాతీయ స్థాయిలోనూ తన ప్రతిభను చాటుకుని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రిష్మితను అభినందించారు. కాగా రిష్మిత ఆల్ ఫోర్స్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

