Starlink India
* సంచలన ఆరోపణలు చేసిన ఎలాన్ మాస్క్..
* అంబానీ వర్సెస్ ఎలాన్ మాస్క్.. . కేంద్రం క్లారిటీ..
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : ఒకరేమో ప్రపంచ కుబేరుడు.. మరొకరేమో ఆసియాలోనే ధనవంతుడుగా ఉన్నారు. అయితే వీరి మధ్య ఓ బిజినెస్ డీల్ విషయంలో వివాదం నెలకొని అదికాస్తా తీవ్ర రచ్చకు దారితీసింది. దీంతో కేంద్రం సైతం కలుగజేసుకొని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇండియాలో స్టార్ లింక్ శాటిలైట్ సేవలు..
భారత్ లో శాటిలైట్ సేవలను అందించాలని ఎలాన్ మాస్క్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందించాలని భావిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలకు మాత్రం కేంద్రం నుంచి సానుకూలత రావడం లేదు. దీంతో చిర్రెత్తిన మాస్క్ అంబానీపై సంచలన ఆరోపణలు చేశారు.
ఇప్పటివరకు స్టార్ లింక్ ప్రపంచంలోని 165 దేశాల్లో లైసెన్స్ పొందిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లుగా భారత ప్రభుత్వం పెట్టిన నిబంధనలన్నింటిని తాము పాటిస్తున్నామని చెప్పారు. అయితే తమకు ఎందుకు శాటిలైట్ సేవలకు లైసెన్స్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
అంబానీయే ఇండియాకు బాసా?..
ఇండియాకు అసలు బాస్ అంబానీయే అంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ ప్రశ్నించారు. భారత్ లో కొందరు ధనిక వ్యాపార వేత్తలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా ఇండియాలో ఇంటర్నెట్.. మొబైల్ నెట్ వర్క్ సరిగా లేదంటూ ఫిర్యాదు చేస్తున్న కొందరు భారతీయుల పోస్టులను సైతం ఎక్స్ వేదికగా పోస్టు చేయడం వైరల్ గా మారింది.
Starlink is licensed in over 165 countries and has spent five years complying with every single law and requirement of the government of India, so why still no license?
Is Ambani the real boss of India?
— Elon Musk (@elonmusk) October 8, 2026
మాస్క్ ఆరోపణలను ఖండించిన కేంద్రం..
ఈ పరిణామాల నేపథ్యంలోనే టెలికం మంత్రిత్వ శాఖ స్పందించింది. ఎలాన్ మాస్క్ ఆరోపణలను ఖండించింది. ఇండియాలో టెలికాం.. శాటిలైట్ సేవల అనుమతుల విధానం పూర్తి పారదర్శకంగా ఉంటుందని పేర్కొంది.
ఎవరి విషయంలోనూ వివక్ష ఉందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు మూడు కంపెనీలకు లైసెన్సులకు అనుమతులు ఇచ్చినట్లు గుర్తుచేసింది. అయితే ఏ ఒక్క కంపెనీ కూడా తమ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించలేదని వెల్లడించింది.
రాహుల్ గాంధీ సైటర్..
మాస్క్ వ్యాఖలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ‘వెల్ కమ్ టూ ఇండియా ఎలాన్.. నువ్వు ఇంకో వ్యక్తి గురించి సైతం త్వరలోనే తెలుసుకుంటావ్’.. అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు.
అయితే ఆయన ఖచ్చితంగా ఆదానీ గురించే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా అంబానీ వర్సెస్ మాస్క్ వివాదం కాస్తా బిజినెస్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మ మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

