Mega Blood Donation Camp
* ప్రారంభించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Mega Blood Donation Camp| ఆకేరు న్యూస్, హైదరాబాద్: మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం ప్రారంభించారు.
సికింద్రాబాద్ పరిధిలోని అశోక్‌నగర్ సర్కిల్, గాంధీనగర్ డివిజన్లో ఉన్న అశోక్‌నగర్ కల్చరల్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బీజేవైఎం మహంకాళి జిల్లా నాయకుడు జె. సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
సేవా సంకల్పానికి ప్రతీక మోదీ
ఈ సందర్భంగా డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ కేవలం ఒక పేరు మాత్రమే కాదని, నిరంతర ప్రజాసేవకు, సేవా సంకల్పానికి ప్రతీక అని కొనియాడారు. మోదీ దృఢమైన నాయకత్వం కారణంగానే ప్రపంచ దేశాలు భారత్‌ను గౌరవంగా చూస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో యువత, నాయకులు, ప్రజలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఉత్సాహంగా పాల్గొన్న నాయకులు
ఈ రక్తదాన శిబిరంలో బీజేపీ, భారతీయ జనతా యువమోర్చాకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి. భారత్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ రామ్, జిల్లా కార్యదర్శి మద్దూరి శివాజీ పాల్గొన్నారు. అలాగే యువ నాయకులు కోవ రాహుల్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, సురేష్ రాజు, శివకృష్ణ, శక్తి సింగ్, బి. అనిల్ కుమార్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

