* షారుఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టేసిన తెలుగు నటి
ఆకేరు న్యూస్ సినిమా డెస్క్ : హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో ఎంగేజ్ మెంట్ తర్వాత నటి శోభితా ధూళిపాళ్ల (Sobhitha Dhoolipaalla) చర్చనీయాంశంగా మారారు. ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్ మెంట్(Engagement) అయినప్పటి నుంచీ ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. దీంతో శోభితా ఎక్కువ ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల లిస్టులో రెండో స్థానంలో నిలిచారు. ఇండియన్ మూవీస్ డేటాబేస్ ఈ వారం విడుదల చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సెలబ్రిటీల జాబితాలో శోభితా (Sobhita) రెండోస్థానంలో నిలవగా..ముంజ్యా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐఎండిబి(IMDB) బ్రేక్ అవుట్ స్టార్ మీటర్ అవార్డును గెలుచుకోవడంతో శార్వరీ(Sarvari) మొదటిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత శోభిత ధూళిపాళ రెండో స్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Sharukh Khan)మూడో స్థానంలో నిలవగా..నాలుగో స్థానంలో కాజల్, ఐదోస్థానంలో జాన్వీ కపూర్ లు ఉన్నారు. లక్ష్య, దీపికా పదుకుణే, విజయ్ సేతుపతి, మ్రుణాల్ ఠాకూర్, ఐశ్వర్యరాయ్(Iswaryarai) ఈ వారం టాప్ పదిలో ఉన్నారు.
———————–