* గేట్లు క్లోజ్ చేసిన అధికారులు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఎగువ నుంచి వస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేయడంతో పర్యాటకులు భారీగా తరలివెళ్తున్నారు. పొంగిపొర్లుతున్న నీటిపరవళ్లను చూసేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఇప్పుడు తాజాగా నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలుపుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విదుదల చేశారు. అనంతరం అన్ని గేట్లను మూసివేశారు. మధ్యాహ్నం వరకు క్రస్ట్ గేట్ల ద్వారా 1.43 లక్షల క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,541 క్యూసెక్కులు, కుడికాలువకు 3937 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 29,273 క్యూసెక్కుల నీటిని వదిలారు. కాగా, నాగార్జునసాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 588.80 అడుగుల వద్ద ఉన్నది. అదేవిధంగా గరిష్ఠ నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 305.46 టీఎంసీలులు ఉన్నాయి.
————————————————————