Actor Bhargav and Actress arya menon
ఆకేరు న్యూస్, సినిమా: కన్నడ చిత్ర పరిశ్రమలో ‘సుప్రీమ్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’(Tholisari Mimmalni Choosindi Modalu) Zసినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆరియా మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై బండి నాగరాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా, మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రీకరణ 70 శాతం పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత బండి నాగరాజు, హీరో, దర్శకుడు భార్గవ్ పాల్గొన్నారు.
ఈ చిత్రంలో భార్గవ్, ఆరియా మీనన్‌తో పాటు సాయి కిషోర్ ఎన్జీ, యాషానా సన్నప్పనవర్, ఛత్రపతి శేఖర్, సుజాత రుద్రవరపు, ప్రేమ సాగర్, బెంగళూరు రజినీ, మైసూరు సుజాత, కిల్లి క్రాంతి, టేస్టీ తేజ, గడ్డం నవీన్, జబర్దస్త్ శాంతకుమార్, లుంగి మామ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తెలుగు, కన్నడ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమా తదుపరి అప్డేట్స్పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

