Farmers
* రైతులకు మంత్రి తుమ్మల సూచన
Tummala Nageswara Rao| ఆకేరు న్యూస్, కమలాపూర్: ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
కమలాపూర్ మండలంలోని గూడూరు రైతు వేదికలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రైతులు కూరగాయల సాగును ప్రోత్సహించాలని, పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచించారు. పంటల సాగులో నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని తెలిపారు.
అదేవిధంగా పత్తి రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని మంత్రి సూచించారు. రైతులు పంటల సాగు, విక్రయాల విషయంలో వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వేణు, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి, మార్కెట్ సెక్రటరీ యాకయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు), రైతులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

