Vavilala Raviteja
* వావిలాల రవితేజ
Vavilala Raviteja| ఆకేరు న్యూస్, ములుగు: విద్య, సమానత్వం, సామాజిక చైతన్యమే స్వేరో ఉద్యమ ప్రధాన ఆశయాలని స్వేరోస్ ములుగు జిల్లా అధ్యక్షుడు వావిలాల రవితేజ అన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమూల మార్పు సాధ్యమని పేర్కొన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని రవితేజ సూచించారు. యువతలోని ప్రతిభను గుర్తించి, వారిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు స్వేరో నెట్వర్క్ కృషి చేస్తోందని తెలిపారు. విద్యతోనే అణగారిన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఎస్ఆర్ శంకరన్ సేవలు చిరస్మరణీయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గురుకుల విద్యా వ్యవస్థ అభివృద్ధికి, అక్షరానికి దూరంగా ఉన్న పేద, అణగారిన వర్గాలకు విద్యను చేరువ చేయడానికి ఎస్ఆర్ శంకరన్ విశేష కృషి చేశారని రవితేజ కొనియాడారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తొలుత స్వేరోస్ జెండాను ఆవిష్కరించి, ఎస్ఆర్ శంకరన్, కొమురం భీం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పలువురు స్వేరో నాయకుల హాజరు
ఈ కార్యక్రమంలో సీనియర్ స్వేరో నాయకులు వావిలాల కిషోర్ కుమార్, ఎంపెల్లి రాజు, మామిడి రాజు, మామిడి చింటూ, దేపాక సాగర్, వావిలాల రామారావు, ఎంపెల్లి జాషువా, చిరంజీవి, పెద్దబోయిన చిరంజీవి, రెబ్బల లక్ష్మణ్, వావిలాల అనిల్ కుమార్, ఎండీ అసిఫ్, అల్లూరి అభిలాష్, కొమురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

