* అమరుల త్యాగాల వల్లే తెలంగాణ వచ్చింది
* రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం : కోదండరాం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం(Prof. Kondaram) , అమీర్ అలీఖాన్(Ameerkhan)లు ప్రమాణం చేశారు. శాసన మండలిలో జరిగిన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై జోక్యానికి సుప్రీం కోర్టు(Suprim court) నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ సిఫార్సులకు అమోద ముద్ర లభించింది. దీంతో వివాదాలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్‌లను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టు(Highcourt)లో సవాలు చేశారు. దీంతో న్యాయపరమైన వివాదాలు తలెత్తాయి. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో కొంత జాప్యం జరిగింది. హైకోర్టు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ నియమకాలను రద్దు చేసిన కొత్తగా ప్రక్రియ చేపట్టాలని సూచించింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అవే పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేశారు. అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా శుక్రవారం మండలిలో వారితో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha SukhendraReddy) ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోదండరాం మాట్లాడుతూ.. అమరుల త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని, రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు.
——————