Kannepalli Pump House
* నేడు కన్నేపల్లికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : బీఆర్ఎస్ నేతల బృందం నేడు కన్నేపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పంప్‌హౌస్‌ను పరిశీలించనుంది. ఈ పర్యటనలో భాగంగా పంప్‌హౌస్ (Kannepalli Pump House) ప్రస్తుత పరిస్థితులు, ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను నేతలు పరిశీలించనున్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నేపల్లి పంప్‌హౌస్ (Kannepalli Pump House) కీలకమైనది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, పర్యటనలో నేతలు ఏయే అంశాలను పరిశీలిస్తారు, ఎలాంటి ప్రకటనలు చేస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

