AP Local Body Elections
* నేడే నామినేషన్లకు చివరి అవకాశం
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో నాలుగు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల (AP local body elections) ప్రక్రియలో కీలక ఘట్టం కొనసాగుతోంది. ఆయా స్థానిక సంస్థలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు నేడు తుది గడువు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
నామినేషన్ల దాఖలుకు (AP local body elections) గడువు ముగిసిన అనంతరం ఎన్నికల తదుపరి ప్రక్రియ కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.
* నవంబర్ 1న పోలింగ్.. 3న కౌంటింగ్
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 1న పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైన చోట నవంబర్ 2న రీపోలింగ్ చేపట్టనున్నారు. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు.
నామినేషన్ల తుది గడువు నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితా విడుదల కావడంతో ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల పోరు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

