Shamshabad Airport (File Photo)
* కౌలాలంపూర్‌కు వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల అరెస్ట్
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. అక్రమంగా విదేశీ కరెన్సీ తరలిస్తున్నారనే అనుమానంతో ఇద్దరు ప్రయాణికులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కౌలాలంపూర్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో DRI అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి వద్ద రూ.63.62 లక్షల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించారు. మరో ప్రయాణికురాలి వద్ద రూ.91.94 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
* రూ.1.56 కోట్ల విదేశీ కరెన్సీ సీజ్..
ఇద్దరి వద్ద కలిపి మొత్తం రూ.1,55,56,000 విలువైన విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు, విదేశీ కరెన్సీ తరలింపు వెనుక ఉన్న కారణాలు, నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణాల్లో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
విదేశీ కరెన్సీని తరలించేందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

