Chilpur Temple Festival
* పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా చిల్పూర్ మండలం (Chilpur Temple Festival) శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామి వారి వార కళ్యాణము వేదమంత్రోచరణలతో అర్చకులు వైభవంగా నిర్వహించారు. కళ్యాణంలో వివిధ గ్రామాల, పట్టణాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
* చిల్పూర్లో ఆధ్యాత్మిక శోభ..
ఈవో లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్త మండలి సభ్యులు గనగోని రమేష్, గోలి రాజశేఖర్, గొల్లపల్లి వాసు, యాదగిరి ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆదిత్య ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కళ్యాణం అనంతరం హైదరాబాద్ కు చెందిన విజయ్ కుమార్ గౌడ్-కవిత, రఘువీర్-శ్రీ చరణి, మంచిర్యాలకు చెందిన అర్జుల సందీప్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి అన్నదాన వితరణ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

