Baby Srinivas
* పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
* ఇల్లందుల బేబీ శ్రీనివాస్ పిలుపు..
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్ : తుపాకీ తూటా కంటే బ్యాలెట్ పేపర్ ఎంతో బలమైనదని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని జఫర్గఢ్ మాజీ జెడ్పీటీసీ, జనగామ జిల్లా డీసీసీబీ జనరల్ సెక్రటరీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్ కోరారు.
శనివారం ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదని, మన భవిష్యత్తును మార్చగల శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి, బాధ్యతాయుతమైన పౌరులుగా మన గళాన్ని వినిపించడానికి ఓటు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
* ఓటు హక్కును వినియోగించుకోండి..
ఓటు రాజ్యాంగబద్ధమైన హక్కుతోపాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన భాగమని, నాయకులను ఎన్నుకునేందుకు అది ప్రధాన మార్గమని తెలిపారు. ప్రజలు నిజాయతీగా ఓటు వేస్తే తమ కోసం నిజాయతీగా పనిచేసే నాయకులను ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రను మార్చగలదని, ప్రజాస్వామ్యానికి అదే అసలైన పునాది అని పేర్కొన్నారు.
సామాన్య పౌరుడి నుంచి దేశ ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరి ఓటు విలువ సమానమేనని అన్నారు. ఓటు వేయకుండా వ్యవస్థను విమర్శించడం కంటే, ముందుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకుని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
* ప్రలోభాలకు లొంగొద్దు..
పట్టభద్రులు మద్యం, డబ్బు వంటి ప్రలోభాలకు లొంగకుండా తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని బేబీ శ్రీనివాస్ కోరారు. ఓటు వేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తప్పుడు నాయకత్వం ఎన్నికయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి ఓటు అమూల్యమైనదని, ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడానికి ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
* నవంబర్ 6 వరకు ఓటరు నమోదు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు 2026 నవంబర్ 6 చివరి తేదీ అని బేబీ శ్రీనివాస్ తెలిపారు. 2026 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయినవారు ఓటరు నమోదుకు అర్హులని పేర్కొన్నారు. గతంలో ఓటరుగా నమోదైనవారు సైతం ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
* సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలి
నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని బేబీ శ్రీనివాస్ కోరారు. శాసనమండలి మేధావుల సభ అని, అక్కడికి విద్యావంతులు, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నవారు వెళ్లాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివి, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన సర్వోత్తమ్ రెడ్డికి నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉందని పేర్కొన్నారు. అమెరికాలోని విలాసవంతమైన జీవితాన్ని వదిలి, స్వప్రాంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.
పార్టీ అధిష్ఠానం ఆశీస్సులతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సర్వోత్తమ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, నిరుద్యోగుల పక్షాన నిలుస్తోందని పేర్కొన్నారు.
సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపితే పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని బేబీ శ్రీనివాస్ అన్నారు. పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

