Alluri District Gelatin Sticks Explosion
* జిలేటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దహనం
* టీచర్ సహా ఐదుగురు మృతి
ఆకేరు న్యూస్, డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం (Alluri District Blast) సంభవించింది. అనంతగిరి మండలంలోని పినకోట గ్రామం సమీపంలో రోడ్డు పనుల కోసం ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్ అనుహ్యంగా పేలడంతో, ఒక మహిళా ఉపాధ్యాయురాలు సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో రోడ్డు పనులకు ఉపయోగిస్తున్న రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
* కొండ తొలగిస్తుండగా ప్రమాదం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పినికోట పరిధిలోని కొండను తొలగించడానికి కాంట్రాక్టర్లు జిలెటిన్ స్టిక్స్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సమయంలో, విశాఖపట్నానికి చెందిన పాఠశాల ఉపాధ్యాయురాలు సునీత స్కూల్‌కు వెళ్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సునీతతో పాటు, దేవరాపల్లికి చెందిన కార్మికుడు మణి, చిడికాడకు చెందిన నారాయణరావు, కడపకు చెందిన పవన్, వాహనం డ్రైవర్ చనిపోయారు.
* దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడుకు (Alluri District Blast) గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల నిర్దిష్ట కారణాలను తెలుసుకోవడానికి, పేలుడు పదార్థాలను సరిగ్గా నిల్వ చేశారా, వాటిని ఉపయోగించడానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు సంబంధించి ఏదైనా నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనపు సమాచారం కోసం దర్యాప్తు నివేదిక కోసం వేచి చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

