* రేవంత్ పై హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు
* ఆయన పరిపాలనలో ఫ్లాప్.. తొండిలో తోపు.. బూతులు తిట్టడంలో టాప్
* ఎక్కడకు చెబితే అక్కడకు వస్తా.. రుణమాఫీ అయిందో..? లేదో..? చూద్దాం..?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై మాజీ మంత్రి హరీశ్‌రావు (Former Minister Harish Rao) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రుణమాఫీ చేశాం.. హరీశ్ రాజీనామా్ చెయ్.. అంటూ హైదరాబాద్ సహా సిద్దిపేటలో వెలిసిన ఫ్లెక్సీల నేపథ్యంలో మండిపడ్డారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడి నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం రుణమాఫీ(Runamaafi) చేసినట్లు ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. ‘‘పాక్షికంగా చేసిన.. తప్పైంది అని క్షమాపణ చెప్పు. నోరు బిగ్గరగా చేసినంత మాత్రాన నిన్ను బీఆర్ఎస్(BRS) వదిలి పెట్టదు. కేబినెట్లో 31వేల కోట్లు అన్నారు. బడ్జెట్లో రూ.26వేల కోట్లు పెట్టారు. తీరా రూ.17933 కోట్లు మాత్రమే ఇచ్చి 22లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. రూ.14వేల కోట్లు కోత పెట్టి రుణమాఫీ పూర్తి అయ్యింది అంటున్నారు. సీఎం నీది నోరా? మోరా? రైతుల సంఖ్య 47లక్షలు అని చెప్పి 22లక్షల మంది రైతులకు మాత్రమే చేశారు. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదు. ఇంకా సిగ్గులేకుండా రుణ మాఫీ చేశామని సంకలు గుద్దుకుంటున్నరు’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నీ చరిత్ర.. నా చరిత్ర ప్రజలకు తెలుసు
‘‘రేవంత్(Revanth) ఎక్కడకు చెబితే అక్కడకు వస్తా.. ప్లేస్ నువ్వే డిసైడ్ చెయ్.. సంపూర్ణ రుణమాఫీ అయిందో? లేదో? రైతులనే అడుగుదాం? నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో ప్రజలకు తెలుసు. మాట తప్పే చరిత్ర నీది? కొడంగల్(Kodangal)లో ఓడితే రాజీనామా చేస్తా అని చెప్పి మాట తప్పింది నువ్వు తెలంగాణ కోసం మాట మీద నిలబడి రాజీనామా చేసిన చరిత్ర నాది. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పిన.. కానీ రుణమాఫీ కూడా సంపూర్ణంగా కాలేదు. రేవంత్(Revanth) పరిపాలనలో ఫ్లాప్ రేవంత్ తొండిలో తోపు బూతులు తిట్టడంలో టాప్.. రుణమాఫీ చేయనందుకు రాజీనామా చేయాల్సింది నువ్వే.. సిగ్గులేకుండా నన్ను రాజీనామా చేయమంటున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు. ‘‘డిసెంబర్ 9న రుణమాఫీ చేయలేదని నేను ప్రశ్నించా. ఆగస్టు15లోపు చేస్తానని మరో తేదీ చెప్పునవ్. ఆగస్టు 15వరకు కూడా పూర్తి చేయలేదు. భౌతిక దాడులకు పురిగొల్పుతున్నారు. కాంగ్రెస్(Congress) గుండాలతో నా క్యాంప్ ఆఫీసుపై దాడి చేయించారు. ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు వస్తాయా? మేము అధికారంలో ఉన్నపుడు దాడులు చేస్తే ఉండేవారా’’ అంటూ హరీష్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
———————————————————–