వెంకటాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
* రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై సమీక్ష
* విధుల్లో బాధ్యతగా ఉండాలని సూచన
ఆకేరు న్యూస్, ములుగు: వార్షిక తనిఖీల్లో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాధ్ శుక్రవారం వెంకటాపురం పోలీస్ స్టేషన్‌తో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయ నిర్వహణ, వివిధ రికార్డులు, పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించారు.
మొదట పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, రిసెప్షన్ కౌంటర్, సీసీటీఎన్ఎస్ నమోదు వివరాలు, ఈ-సాక్ష్య అమలు పురోగతిని సమీక్షించారు. కేసులకు సంబంధించిన రికార్డులను నిబంధనల ప్రకారం క్రమబద్ధంగా నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, బెల్ ఆఫ్ ఆర్మ్స్, కార్యాలయ గదులు, ఇతర ప్రాంగణాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో పరిశుభ్రతను పాటించాలని, విధుల నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యతతో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు అందించే పోలీస్ సేవల్లో నిబద్ధత, పారదర్శకత పాటిస్తూ వృత్తి నైపుణ్యాన్ని నిరంతరం పెంపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఏటూరునాగారం మనన్ భట్ ఐపీఎస్, వెంకటాపురం సీఐ ముత్యం రమేష్, సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతి, వాజేడు ఎస్ఐ జక్కుల సతీష్, పేరూరు ఎస్ఐ అశోక్, ఎస్ఐ తిరుపతి రెడ్డి, డీసీఆర్బీ ఏఎస్ఐ శంకరయ్యతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

